Header Banner

ఆ ఇద్దరూ ఆదుకోకపోతే... సన్ రైజర్స్ కు ఈ మాత్రం స్కోరైనా వచ్చేది కాదు!

  Wed Apr 23, 2025 22:18        Sports

సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ పరంగా మరోసారి తేలిపోయింది. ఇవాళ ముంబయి ఇండియన్స్ తో సొంత గడ్డ ఉప్పల్ స్టేడియంలో మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ పేలవంగా ఆడింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 143 పరుగులు చేసింది. అది కూడా మిడిలార్డర్ లో హెన్రిచ్ క్లాసెన్, అభినవ్ మనోహర్ ఆదుకోబట్టి ఆ మాత్రం స్కోరైనా వచ్చింది. వాళ్లిద్దరూ కూడా చేతులెత్తేసి ఉంటే, సన్ రైజర్స్ ఓ 100 లోపు స్కోరుకో పరిమితం అయ్యేదేమో.. ఈ మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోగా, సన్ రైజర్స్ మొదట బ్యాటింగ్ కు దిగింది. 35 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి అత్యంత దయనీయ స్థితిలో నిలిచింది. ట్రావిస్ హెడ్ (0) డకౌట్ కాగా, అభిషేక్ శర్మ 8, ఇషాన్ కిషన్ 1, నితీశ్ కుమార్ రెడ్డి 2, అనికేత్ వర్మ 12 పరుగులు చేశారు. ఈ దశలో క్లాసెన్, అభినవ్ మనోహర్ జోడీ ఎదురుదాడికి దిగి స్కోరుబోర్డును ముందుకు నడిపించింది. క్లాసెన్ 44 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సులతో 71 పరుగులు చేయగా... అభినవ్ మనోహర్ 37 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సులతో 43 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ లో ముంబయి బౌలర్లు ట్రెంట్ బౌల్ట్, దీపక్ చహర్ వికెట్ల పండుగ చేసుకున్నారు. బౌల్ట్ కు 4, చహర్ కు 2 వికెట్లు లభించాయి. బుమ్రా 1, కెప్టెన్ హార్దిక్ పాండ్యా 1 వికెట్ తీశారు.

 

ఇది కూడా చదవండి: ఏపీ ప్రజలకు అదిరిపోయే న్యూస్.. కొత్తగా నేషనల్ హైవే.. జిల్లాలో క్లోవర్‌ లీఫ్‌! ఆకాశనంటుతున్న భూముల ధరలు..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

కేశినేని బ్రదర్స్ మధ్య మాటల యుద్ధం.. రాజకీయ వైరం మరోసారి తెరపైకి! హీటెక్కిన రాజకీయ వాతావరణం!

 

ఏపీ టెన్త్ ఫలితాల్లో అరుదైన రికార్డ్.. ఈ అమ్మాయికి 600/600 మార్క్స్.. ఇదే ఫస్ట్ టైమ్!

 

ఒంగోలులో తీవ్ర కలకలం.. టీడీపీ నేత హత్యలో రాజకీయ కోణం! వైసీపీ నాయకుడిపై అనుమానం -12 బృందాలతో గాలింపు!

 

వైసీపీ కి మరో ఊహించని షాక్! కీలక నేతకు రిమాండ్!

 

ఉత్కంఠ రేపుతున్న పదో తరగతి ఫలితాలు.. ఒక్క క్లిక్‌తో అందుబాటులో! మీ ఫలితాన్ని ఇలా తెలుసుకోండి!

 

ఏపీ నుంచి రాజ్యసభకు మంద కృష్ణ.. అమిత్ షా–చంద్రబాబు భేటీ! రాజ్యసభ స్థానం ఎన్నికకు వారి పేర్లు..!

 

నిరుద్యోగులకు తీపికబురు.. ఏపీపీఎస్సీ నుంచి 18 జాబ్‌ నోటిఫికేషన్లు జారీకి సిద్ధం!

 

వారికి గుడ్​న్యూస్​ - జులై నుంచి కొత్త పింఛన్లు! వైకాపా నేతల సిఫారసులతో..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Sports #teamindia